ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కడపలో విస్తృత తనిఖీలు... 215 మద్యం సీసాలు సీజ్​

కడప పోలీస్​స్టేషన్​ పరిధిలో పోలీసులు విస్తృత తనిఖీలు చేశారు. మద్యం నిల్వలు ఉన్నాయన్న సమాచారంతో దాడులు చేశారు. 215 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు.

alcohol
పోలీసులు స్వాధీనం చేసుకున్న మద్యం సీసాలు

By

Published : May 6, 2021, 5:15 PM IST

కడప తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో పోలీసులు విస్తృత దాడులు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా మద్యం నిల్వలు ఉన్నాయన్న సమాచారంతో తనిఖీలు నిర్వహించారు. 215 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.

"భగత్​సింగ్ నగర్​కు చెందిన రామరాజు... నగరంలోని దుకాణాల్లో మద్యం కొనుగోలు చేసి.. వాటిని నిల్వ ఉంచి అధిక ధరలకు విక్రయించేవాడు. భవానీనగర్​కు చెందిన వ్యక్తి.. బెంగళూరు నుంచి అక్రమంగా మద్యం తీసుకొచ్చి అధిక ధరలకు అమ్ముతుండేవాడు" అని గుర్తించి తనిఖీలు చేసినట్టు పోలీసులు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details