ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దుకాణాలపై దాడులు... 60వేలు విలువ చేసే గుట్కా స్వాధీనం

కడప జిల్లాలో పలు దుకాణాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. రూ. అరవై వేలు విలువ చేసే గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురిని అరెస్ట్ చేశారు.

police raid  on shops
దుకాణాలపై దాడులు... 60వేలు విలవ చేసే గుట్కా ప్యాకెట్లు స్వాధీనం

By

Published : Jan 9, 2021, 3:19 AM IST

కడప జిల్లా జమ్మలమడుగు పోలీసులు.. పట్టణంలో దాడులు చేశారు. శుక్రవారం సాయంత్రం పలు దుకాణాల్లో దాడులు చేసి రూ.60,000 విలువైన గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. 4,125 ప్యాకెట్లు స్వాధీనం చేసుకుని ఐదుగురిని అరెస్ట్ చేశారు.

పలు దుకాణాల యజమానులు గుట్టుచప్పుడు కాకుండా ప్యాకెట్లు విక్రయిస్తున్నట్టు తమకు సమాచారం అందడంతో దాడులు చేశామని పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి

అక్రమంగా తరలిస్తున్న 100 బస్తాల బెల్లం, పటిక సీజ్​

ABOUT THE AUTHOR

...view details