కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా రెడ్ జోన్‌గా ప్రకటించిన కడప జిల్లా వేంపల్లిలో పోలీసులు కవాతు నిర్వహించారు. పులివెందుల డీఎస్పీ వాసుదేవన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కవాతులో స్థానిక పోలీసులతోపాటు ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ సెక్యూరిటీ సిబ్బంది కూడా పాల్గొన్నారు. ప్రజలెవరూ రోడ్లపైకి రావొద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు. కావాల్సిన నిత్యావసర వస్తువులు ఇంటివద్దకే సరఫరా చేస్తామన్నారు. నిబంధనలు ఉల్లిఘించి ఎవరైనా రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కవాతు ప్రారంభానికి ముందు ట్రిపుల్ ఐటి సిబ్బందికి డీఎస్పీ మాస్క్‌లు పంపిణీ చేశారు.
వేంపల్లి రెడ్‌జోన్ ఏరియాలో పోలీసుల కవాతు - వేంపల్లి రెడ్‌జోన్ ఏరియాలో పోలీసుల కవాతు
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌కు ప్రజలందరూ సహకరించాలని పులివెందుల డీఎస్పీ విజ్ఞప్తి చేశారు. రెడ్ జోన్‌గా ప్రకటించిన వేంపల్లిలో డీఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు కవాతు నిర్వహించారు.
పోలీసుల కవాతు