కడప జిల్లాలో అప్రమత్తమైన పోలీస్ అధికారులు - కడప జిల్లాలో పోలీసులు అప్రమత్తం
రాష్ట్రంలో కొవిడ్-19 కేసులు పెరుగుతున్నందున కడప జిల్లా పోలీస్ అధికారులు అప్రమత్తమయ్యారు. కరోనా వైరస్ నిరోధానికి అందరూ సహకరించాలని తెలిపారు.
![కడప జిల్లాలో అప్రమత్తమైన పోలీస్ అధికారులు Police officers in Kadapa district alerted](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6614895-1077-6614895-1585683922450.jpg)
కడప జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గంలో జిల్లా ఎస్పీ అన్బురాజన్ పర్యటించారు. చెక్‌పోస్ట్‌లు, జిల్లాల సరిహద్దులను పరిశీలించారు. ఇతర జిల్లాల వాళ్లు కడప జిల్లాల్లోకి రాకుండా, జిల్లా నుంచి ఇతర జిల్లాలకు వెళ్లకుండా సరిహద్దులను మూసివేశామని స్థానిక డీఎస్పీ నారాయణస్వామి రెడ్డి తెలిపారు. కరోనా వైరస్ రాష్ట్రాల నుంచి జిల్లాల్లో వ్యాపిస్తుందన్న సమాచారంతో ముందస్తు జాగ్రత్తగా జిల్లా సరిహద్దులను మూసివేశామని తెలిపారు. ప్రభుత్వం చెప్పినట్టు ప్రజలను ఇళ్ల నుంచి రాకుండా చూస్తున్నామని...తెలిపారు. కరోనా వైరస్ నిరోధానికి అందరూ సహకరించాలని తెలిపారు.