చంటిబిడ్డను ఇంటి దగ్గర వదల్లేక విధులకు తీసుకొచ్చారు ఓ మహిళా ఎస్సై. అమ్మలా లాలిస్తూనే.. మరోవైపు తన కర్తవ్యాన్ని నిర్వర్తించారు. కడప దిశ పోలీస్ స్టేషన్లో ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్నారు వరలక్ష్మి. పరిషత్ ఎన్నికల్లో కడప జిల్లా ఎర్రగుంట్ల మండలంలో విధులు కేటాయించారు. ఆమెకు ఆరునెలల చంటిపాప ఉంది. ఇంట్లో నుంచి విధులకు వద్దామనుకంటే.. ఇంట్లో బిడ్డ ఏడుపు. తల్లి మనసు వదిలి వెళ్లాలనుకోలేదు. మరోవైపు ఎన్నికల విధులు... చేసేదేం లేక బిడ్డను తీసుకుని విధులకు హాజరయ్యారు వరలక్ష్మి. కర్తవ్యాన్ని నిర్వహిస్తూనే.. తన బిడ్డ ఆలనా..పాలనా చూసుకున్నారు. ఎన్నికల ప్రక్రియను పరిశీలించేందుకు అటుగా వచ్చిన కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్.. ఈ దృశ్యాన్ని చూసి ఎస్సైని అభినందించారు. పోలీస్ అయితేనేం.. అమ్మే.. కదా..!
మదిలో మాతృత్వం.. మరవని కర్తవ్యం.. - కడపలో చంటిబిడ్డతో విధులకు హాజరైన పోలీస్ మధర్ న్యూస్
ఓ వైపు ఎన్నికల విధులు.. మరోవైపు.. తన ఆరునెలల చంటిబిడ్డ. ఏం చేయాలి..? కన్నబిడ్డ కోసం.. విధులకు దూరంగా ఉందాంలే అనుకుంటారు చాలామంది. లేదు.. లేదు.. బిడ్డను ఇంట్లో ఎవరికైనా అప్పజెప్పి విధులు చూసుకుని త్వరగా వద్దాంలే.. అనుకుంటారు మరికొంతమంది.. కానీ ఆ మహిళా ఎస్సై అలా అనుకోలేదు. తన బిడ్డను ఎత్తుకొనే ఎన్నికల విధులు నిర్వర్తించారు.
![మదిలో మాతృత్వం.. మరవని కర్తవ్యం.. మదిలో మాతృత్వం.. విధుల్లో కర్తవ్యం..](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11331327-369-11331327-1617891749634.jpg)
మదిలో మాతృత్వం.. విధుల్లో కర్తవ్యం..
TAGGED:
police mother in kadapa news