ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

యువకుడిని చితకబాదిన ఎస్సై... వీడియో వైరల్ - kadapa crime news

కడపలో ఓ ఎస్​ఐ ప్రవర్తన విమర్శలు తావిస్తోంది. కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించాడని ఓ యువకుడిని చితకబాదడంపై నగరవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యువకుడిని కొట్టే వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

police man attack on boy at kadapa
యువకుడిని చితకబాదిన ఎస్సై

By

Published : May 27, 2021, 4:51 PM IST

యువకుడిని చితకబాదిన ఎస్సై

కడప రెండో పట్టణం పరిధిలో ఓ యువకుడు కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘించి ద్విచక్ర వాహనంపై వెళ్తున్నాడు. మార్గమధ్యంలో ద్విచక్రవాహనాన్ని వెనక్కి తిప్పే ప్రయత్నంలో కింద పడ్డాడు. ఈ క్రమంలో అక్కడే ఉన్న స్థానిక ఎస్ఐ జీవన్​రెడ్డి... యువకుడి వద్దకు చేరుకుని లాఠీతో చితకబాదాడు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో హల్​చల్ చేస్తున్నాయి. విషయం తెలుసుకున్న ఎస్పీ సంబంధిత ఎస్​ఐపై చర్యలకు ఉపక్రమించారు.

ABOUT THE AUTHOR

...view details