కడప జిల్లా ప్రొద్దుటూరు మూడో పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్సై శంకర్ రావు మానవత్వం చాటుకున్నారు. పట్టణంలోని వెంకటేశ్వర కొట్టాలులో చౌడమ్మ అనే మహిళ మిద్దె పై నుంచి దిగుతూ కింద పడిపోయింది. దీంతో ఆమె తలకు బలమైన గాయమైంది. అటువైపు వెళ్తున్న ఎస్సై శంకర్‌రావు గుర్తించి. అక్కడున్న మహిళలతో కలిసి ఆమెను ఆటోలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. లాక్‌డౌన్ అమలులో ఉన్న నేపథ్యంలో ఎస్సై సేవలను స్థానికులు అభినందించారు.
మానవత్వం చాటుకున్న ఎస్సై - lock down in prodhuturu
కడప జిల్లా ప్రొద్దుటూరు మూడో పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్సై శంకర్ రావు.. తలకు గాయమైన ఓ మహిళకు సాయమందించారు. చికిత్స నిమిత్తం ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్లి రక్షించారు.

ప్రొద్దుటూరులో మానవత్వం చాటుకున్న ఎస్సై