కడపలో ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించిన కొమ్మ సూపర్ స్పెషాలిటీ, కేసీహెచ్ సూపర్ స్పెషాలిటీ ప్రైవేటు కొవిడ్ ఆసుపత్రులపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. కొంత మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఆసుపత్రికి వచ్చిన బాధితుల నుంచి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు రావడంతో.. కడప విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో ఆరోపణలు రుజువు కావడంతో విజిలెన్స్ అధికారులు నివేదికను పోలీసులకు అందజేశారు. ఈ మేరకు రెండు ఆసుపత్రుల పై క్రిమినల్ కేసులు నమోదు చేశామని ఒకటో పట్టణ సీఐ సత్యనారాయణ తెలిపారు. ఎవరైనా ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
నిబంధనలు ఉల్లంఘించిన ఆసుపత్రులపై క్రిమినల్ కేసులు
ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించిన కడపలో ప్రైవేటు కొవిడ్ వైద్యశాలలపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. రోగుల నుంచి అధిక మెుత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారని తెలిపారు.
కడప సీఐ సత్యనారాయణ