Woman Left Home With Two Children: ఈ నెల 27వ తేదీన కనిపించకుండా పోయిన జరీనాను ఎట్టకేలకు పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా గుర్తించి.. తల్లీబిడ్డలను బంధువులకు అప్పగించారు. జరీనా తన భర్త వేరే మహిళతో వివాహేతర సంబంధం కలిగి ఉన్నాడనే కోపంతో తన ఇద్దరి బిడ్డలతో సహా ఇంటి నుంచి వెళ్లిపోయింది.
భర్త వేరే మహిళతో వివాహేతర సంబంధం కలిగి ఉన్నాడని కోపంతో తన ఇద్దరి బిడ్డలతో సహా కనిపించకుండా పోయిన జరీనాను ఎట్టకేలకు పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా గుర్తించారు. తల్లీబిడ్డలను బంధువులకు అప్పగించారు.. వైయస్సార్ జిల్లాలో ఈ నెల 27వ తేదీన జరీనా కనిపించకుండా పోవడంతో ఆమె తల్లి రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తల్లీబిడ్డల కోసం చుట్టుపక్కల గాలించినప్పటికీ.. ఆచూకీ లభించలేదు. ఆమె చరవాణి కాల్ డేటా ఆధారంగా ఆమె బెంగుళూరులో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.. గురువారం రాత్రి బెంగళూరుకు వెళ్లి ఆమెను కడపకు తీసుకువచ్చారు. ఇలా భర్త మీద కోపంతో ఇల్లు వదిలి వెళ్ళడం మంచి పద్ధతి కాదని.. ఏదైనా సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకుని రావాలని పోలీసులు సూచించారు. పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారని జరీనా తెలిపింది.
గత 15 రోజుల కిందట ఇలానే పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ అచ్చెన్న కిడ్నాప్‌నకు గురై.. కొద్దిరోజుల తర్వాత శవమై కనిపించాడు. దీంతో కడప జిల్లా పోలీసులు అదృశ్య కేసుల పట్ల అప్రమత్తంగా ఉంటున్నారు.
అసలు ఏం జరిగిందంటే:వైయస్సార్ జిల్లా చింతకొమ్మదిన్నె మండలం చెర్లోపల్లెకి చెందిన అక్బర్, జరీనాలకు కొన్నేళ్ల క్రిందట వివాహమైంది. సయ్యద్ అక్బర్ భవన నిర్మాణ పని చేస్తూ జీవిస్తున్నాడు. సయ్యద్ అక్బర్, జరీనా దంపతులకు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. అక్బర్ ఇటీవల కాలంలో వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఉండేవి. ఈ నేపథ్యంలో జరీనా భర్తలో మార్పు రాకపోవడంతో భర్తపై ఉన్న కోపంతో జరీనా ఈ నెల 27వ తేదీన భర్త భవన నిర్మాణ పనికి వెళ్లగా.. జరీనా తన సోదరుడు అన్వర్ బాషాకు ఫోన్ చేసి.. తనను కడప మోచంపేటలో ఉన్న వాళ్ల అమ్మ ఇంట్లో దించాలని చెప్పింది. దీంతో సోదరుడు వచ్చి.. తన సోదరిని, ఇద్దరు పిల్లలను ద్విచక్ర వాహనంలో తీసుకొచ్చి మోచంపేటలో దించాడు. కానీ వారు మాత్రం ఇంటికి వెళ్లలేదు. ఈ విషయం తెలుసుకున్న జరీనా తల్లి షేక్ ఖదిరున్నీసా చాలా సమయం వేచి చూసి.. తరువాత చుట్టుపక్కల గాలింపు చర్యలు చేపట్టారు. అయినా సరే ఫలితం లేకపోయింది. వాళ్ల జాడ ఎక్కడా తెలియలేదు.చుట్టుపక్కల ఎంత వెతికినా తల్లీ, బిడ్డలు కనిపించకపోవడంతో.. కడప రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇవీ చదవండి: