ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

missing case chased: చిన్నారుల అదృశ్యం.. 24 గంటల్లోనే ఛేధించిన పోలీసులు - kadapa crime

కడప జిల్లా బద్వేలులో చిన్నారుల అదృశ్యం కేసును పోలీసులు ఛేదించారు. హైదరాబాద్​లోని హుస్సేనీ ఆలం ఠాణా పరిధిలో ఉన్నారని గుర్తించిన పోలీసులు.. వారిని బద్వేలుకు తీసుకువచ్చారు. అనంతరం వారి తల్లిదండ్రులకు అప్పగించారు.

చిన్నారుల అదృశ్యం కేసును ఛేదించిన పోలీసులు
చిన్నారుల అదృశ్యం కేసును ఛేదించిన పోలీసులు

By

Published : Nov 6, 2021, 10:05 PM IST

కడప జిల్లా బద్వేలు పట్టణానికి చెందిన నభీరసూల్, రహీం, రెహమాన్ అనే ముగ్గురు చిన్నారులు అదృశ్యమయ్యారు. శుక్రవారం పాఠశాలకు వెళ్లిన తమ పిల్లలు కనిపించడం లేదని వారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదుతో బద్వేలు అర్బన్ ఎస్ఐ. రామచంద్ర తెలుగు రాష్ట్రాల్లోని పోలీస్​స్టేషన్లకు సమాచారం అందించారు. ముగ్గరు బాలురు హైదరాబాద్​లోని హుస్సేనీ ఆలం ఠాణా పరిధిలో ఉన్నారని గుర్తించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర పోలీసుల సహకారంతో ముగ్గురు చిన్నారులను బద్వేలుకు రప్పించి, వారి తల్లిదండ్రులకు అప్పగించారు. తప్పిపోయిన బాలురను 24 గంటల వ్యవధిలోనే ట్రేస్ చేసి తమకు అప్పగించడంపై బాధితులు హర్షం వ్యక్తం చేశారు. ఎస్ఐ. రామచంద్రకు కృతజ్ఞతలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details