కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు కడప జిల్లా రాయచోటిలో లాక్డౌన్ని కఠినంగా అమలు చేస్తున్నారు. కర్ఫ్యూ కారణంగా రోడ్లపైకి వాహనాలతో వచ్చిన వారిపై లాఠీఛార్జీ చేస్తున్నారు. రహదారులపైకి ఎవరూ రాకుండా అడ్డుకుంటున్నారు. వాహనాల అద్దాలు, ఇతర పరికరాలను ధ్వంసం చేసి ఇంటికి పంపిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప.. ఎట్టి పరిస్థితుల్లోనూ జనం ఇంట్లో నుంచి బయటకు వచ్చేందుకు వీలు లేదని హెచ్చరికలు జారీ చేశారు.
లాక్డౌన్: యువకులపై లాఠీఛార్జి - కడపలో లాక్డౌన్ని అతిక్రమించిన వారిపై లాఠీఛార్జీ
కర్ఫ్యూ ఉంది.. బయటకు రావద్దు అంటే వినరు. ఎన్ని సార్లు చెప్పినా ఇంతే.. మారని వారికి బుద్ధి చెప్పేందుకు పోలీసులు లాఠీని ఉపయోగిస్తున్నారు. మళ్లీ ఇంకోసారి బయటకు రావద్దంటూ చితక బాదుతున్నారు.
police charged on who violeting the curfew at rayachoti in kadapa