కడప జిల్లా వీరబల్లి మండలానికి చెందిన రామచంద్రయ్య అనే వ్యక్తి హత్య కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏడాది కిందట రామచంద్రయ్య కనిపించక పోవడం కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు వీరబల్లి పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేశారు. ఏడాది తర్వాత ఆ కేసు చిక్కుముడి వీడింది. అదృశ్యమైన వ్యక్తి హత్యకు గురయ్యాడని పోలీసులు తేల్చారు. అదే గ్రామానికి చెందిన వీరసత్యం, శివసత్యం అనే ఇద్దరు సోదరులు తమ తండ్రి మరణానికి రామచంద్రయ్య కారణమనే అనుమానంతో గత ఏడాది మే నెలలో బెంగళూరు తీసుకెళ్లి బెదిరించారు. తనకేమి తెలియదని రామచంద్రయ్య చెప్పడం వల్ల తిరిగి జిల్లాకు తీసుకొస్తూ మదనపల్లి సమీపంలోని బోయకొండ అటవీ ప్రాంతంలో హత్య చేసి పాతిపెట్టారు.
హత్య కేసును ఛేదించిన పోలీసులు - murders case at kadapa district news
తండ్రి మరణానికి కారణమయ్యాడని భావించిన ఇద్దరు అన్నదమ్ములు కలిసి ఓ వ్యక్తిని హత్య చేశారు. అయితే హత్య జరిగిన ఏడాదికి సాంకేతిక పరిజ్ఞానంతో పోలీసులు ఈ కేసును ఛేదించారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు వారి నుంచి పలు వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.
హత్య కేసును చేధించిన పోలీసులు
సాంకేతిక పరమైన ఆధారాలు, కాల్ డేటా ఆధారంగా పోలీసులు కేసు ఛేదించారు. ఈ కేసులో నిందితులైన శివసత్యం, వీరసత్యంను అరెస్ట్ చేసి.. వారి నుంచి కారు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మూడో నిందితుడు సూర్యకుమార్ విదేశాల్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అతన్ని అరెస్ట్ చేసేందుకు లుక్ అవుట్ నోటీసులు జారీ చేస్తున్నట్లు కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్ తెలిపారు.
ఇవీ చూడండి..:ఇసుక కావాలని బుక్‌చేస్తే మట్టిని పంపారు..!