కరోనా రోజురోజుకు ఉద్ధృతమవుతున్న వేళ రాష్ట్రంలోనే తొలిసారిగా కడప జిల్లా చిట్వేలు మండలంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కరోనా మహమ్మారి పై అవగాహన రథాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు డి.ఎస్.పి నారాయణస్వామి రెడ్డి. ప్రజలందరూ కరోనా వైరస్ పై అవగాహన పెంచుకుని ప్రతీ ఒక్కరు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని పేర్కొన్నారు. పోలీస్ శాఖ సూచించిన విధంగా ప్రజలందరూ కరోనా వ్యాప్తి నిరోధానికి ప్రజలందరూ సహకరించాలని ఆయన తెలిపారు.
కరోనాపై పోలీస్ ప్రచార రథం ప్రారంభం
కడప జిల్లా చిట్వేలు మండలంలో పోలీసులు కరోనా వైరస్ పై అవగాహన కోసం పోలీస్ ప్రచార రథాన్ని ప్రారంభించారు.
కరోనాపై పోలీస్ ప్రచార రథం ప్రారంభం
ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా రాజంపేట డి.ఎస్.పి నారాయణ స్వామి రెడ్డి, రైల్వే కోడూరు సిఐ ఆనంద్ రావు, చిట్వేల్ ఎస్సై వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
ఇవీ చదవండి: అనారోగ్యంతో కమలాపురం తహసీల్దార్ మృతి