కడప జిల్లా ఎర్రగుంట్ల నాలుగు రోడ్ల కూడలిలో కరోనాపై.. పోలీసులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. రోడ్లపై పెయింటింగ్ వేయించారు. కరోనా వైరస్ ఎలా వ్యాప్తి చెందుతోంది.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయాలు వివరిస్తున్నారు. ఒక మనిషి నుంచి మరో మనిషి ఎంత దూరం ఉండాలో బొమ్మల ద్వారా తెలియచేశారు. ప్రజలంతా ఇంట్లోనే ఉండి కరోనాని అరికట్టాలని కోరారు.
పోలీసుల వినూత్న ప్రయత్నం.. ప్రజల్లో చైతన్యం - కరోనా బొమ్మలతో కడపలో లాక్డౌన్పై అవగాహన
ప్రజలు లాక్డౌన్ని పాటించాలని.. ఇంట్లోనుంచి బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలను పోలీసులు కోరుతున్నారు. రోడ్లపై కరోనా బొమ్మలు వేయిస్తూ అవగాహన కలిగిస్తున్నారు.
Police awareness on lockdown wtih corona virus drawings at yerraguntla in kadapa