కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం తిప్పరాజు పల్లెగుట్టల్లోని నాటుసారా తయారీ కేంద్రాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. సారా తయారీకి సిద్ధంగా ఉంచిన 300 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. పక్కా సమాచారం మేరకు నాటుసారా స్థావరాలపై ఎస్ఐ కొండారెడ్డి సిబ్బందితో కలిసి దాడి చేశారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ కొండారెడ్డి హెచ్చరించారు.
రెచ్చిపోతున్న నాటుసారా తయారీదారులు - కడపలో నాటుసారా తయారీ కేంద్రాలు తాజా వార్తలు
లాక్డౌన్ వేళ తినడానికి తిండి లేక ఒకవైపు జనం ఇబ్బంది పడుతుంటే.. మరోవైపు మద్యానికి బానిసలైన వారు మద్యం దొరకక అల్లాడుతున్నారు. ఇదే అదునుగా భావించిన కొందరు అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. కడప జిల్లాలో నాటుసారా తయారీ కేంద్రాలపై పోలీసులు దాడులు నిర్వహిస్తున్నప్పటికీ... ఎక్కడో ఒక చోట అక్రమంగా నాటుసారాను తయారు చేస్తూనే ఉన్నారు.
నాటుసారా తయారీ స్థావరాలపై పోలీసుల దాడులు
ఇవీ చూడండి...