కడప జిల్లా ప్రొద్దుటూరులో ఏడుగురు మట్కా బీటర్లను పోలీసులు పట్టుకున్నారు. మట్కా నిర్వహిస్తున్నారన్న సమాచారం అందుకున్న పోలీసులు... దాడులు చేశారు. ఏడుగురిని అరెస్టు చేసి, వారి నుంచి రూ. 68 వేలు నగదు, చరవాణి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులకు సమాచారం అందించే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని సీఐ నరసింహారెడ్డి చెప్పారు.
ప్రొద్దుటూరులో మట్కా స్థావరాలపై పోలీసుల దాడి - మైదుకూరు నేటి వార్తలు
కడప జిల్లా ప్రొద్దుటూరులో మట్కా స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. మట్కా నిర్వహిస్తున్న ఏడుగురిని అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ.68వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల అదుపులో నిందితులు
Last Updated : Sep 23, 2020, 8:21 AM IST