కడప జిల్లా రైల్వేకోడూరు మండలంలో తమిళనాడు ధర్మపురి జిల్లాకు ఎర్రచందనం స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. స్మగ్లర్లు కుంజన ఫారెస్ట్ నుంచి కొండ దిగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో.. వారు రైల్వే గేటు నుంచి కుంజన ఫారెస్ట్‌లోకి వెళ్లారు. స్మగ్లర్లు దిగుతున్న మార్గంలో కాపు కాసి దాదాపు 10మందిని పట్టకున్నారు. టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ రవిశంకర్ ఆదేశాల మేరకు బాలపల్లి బీట్‌లో మంగళవారం సాయంత్రం నుంచి కూంబింగ్ చేపట్టారు. స్మగ్లర్ల నుంచి 19 ఎర్ర చందనం దుంగలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
స్మగ్లర్లు అరెస్ట్..ఎర్రచందనం దుంగలు స్వాధీనం - కడపలో ఎర్రచందనం స్మగ్లర్లను పట్టుకున్న పోలీసులు
రైల్వేకోడూరు సమీపంలో ఎర్రచందనం దుంగలు తరలిస్తున్న పది మంది స్మగ్లర్లను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వారి నుంచి 19 ఎర్ర చందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు.
![స్మగ్లర్లు అరెస్ట్..ఎర్రచందనం దుంగలు స్వాధీనం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4624257-646-4624257-1570023331081.jpg)
ఎర్రచందనం స్మగ్లర్లను పట్టుకున్న పోలీసులు
ఎర్రచందనం స్మగ్లర్లను పట్టుకున్న పోలీసులు