ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

INSURANCE FRAUD: రైతుల బీమా సొమ్ము బొక్కేసిన ఉద్యోగుల అరెస్ట్ - క్రైమ్ వార్తలు

రైతులకు అందవలసిన పంట బీమా సొమ్మును సొంత అవసరాలకోసం కాజేసిన ఇద్దరు సచివాలయ ఉద్యోగులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.7,16,117ను స్వాధీనం చేసుకున్నారు.

INSURANCE FRAUD
INSURANCE FRAUD

By

Published : Aug 27, 2021, 6:24 PM IST

రైతులను మోసం చేస్తూ.. వారికి సంబంధించిన పంట బీమా సొమ్మును కాజేసిన ఇరువురు సచివాలయ ఉద్యోగులను కడప జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. వారిలో ఓ మహిళా ఉద్యోగిని ఉండడం విశేషం. నిందితుల నుంచి పోలీసులు రూ.7,16,117 నగదును స్వాధీనం చేసుకున్నారు.

కడప జిల్లా ఖాజీపేట మండలం మిడుతూరు గ్రామంలో 2020 సంవత్సరంలో కురిసిన వర్షాలకు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం బీమా డబ్బులను మంజూరు చేసింది. కానీ.. మిడుతూరు పంచాయతీలో ఉద్యానవన శాఖ అధికారి నాగ భవానీ, సచివాలయ అసిస్టెంట్ వెంకట సిద్ధారెడ్డిలు రైతులకు అందవలసిన ఆ బీమా సొమ్ముపై కన్నేశారు. వాటిని తమ స్వప్రయోజనాలకు ఉపయోగించుకున్నారు. రైతులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఖాజీపేట పోలీసులు దీనిపై కేసు నమోదు చేశారు. సకాలంలో విషయం బయటపడడంతో మరికొంతమంది రైతులు మోసానికి గురి కాకుండా పోలీసులు అడ్డుకోగలిగారని ఎస్పీ అన్నారు.

ఇదీ చదవండి:ఆలిండియా రోడ్ ట్రాన్స్​ఫోర్టు ఫెడరేషన్​ జాతీయ సమావేశాలకు సన్నద్ధం..

ABOUT THE AUTHOR

...view details