Red sandalwood smuggling: వైయస్సార్ జిల్లా కాశినాయన మండలం నల్లమల అటవీ ప్రాంతంలో ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. కోటి రూపాయల విలువైన 57 ఎర్రచందనం దుంగల్ని తరలించేందుకు సిద్ధమవుతుండగా నలుగుర్ని పోలీసులు పట్టుకున్నారు. పట్టుకున్న నలుగురు స్మగ్లర్లలో ఒక సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కూడా ఉన్నట్లు జిల్లా ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. ఇతనితో పాటు భాస్కర్, వెంకట సుధాకర్, నాగభూషణం అనే ముగ్గురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి ఎర్రచందనం దుంగలతో పాటు ఒక వాహనం, 2 బైకులు, 5 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు.
Smuggling: ఎర్రచందనం అక్రమ రవాణా ముఠా అరెస్ట్.. నిందితుల్లో ఒకరు..! - ఏపీ తాజా వార్తలు
Red sandalwood smuggling: ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. 57 ఎర్రచందనం దుంగలు, ఒక వాహనం, 2 బైకులు, 5 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నలుగురు స్మగ్లర్లలో ఒక సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఎక్కడంటే..?
ఎర్రచందనం అక్రమ రవాణా ముఠా అరెస్ట్