ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎర్రచందనం అక్రమరవాణాపై దాడులు.. 8 మంది అరెస్టు - kadapa crime news

కడప జిల్లా అటవీ ప్రాంతాల్లో ఎర్రచందనం అక్రమరవాణాపై పోలీసులు దాడులు చేశారు. మొత్తం 10 దుంగలను స్వాధీనం చేసుకొని.. ఎనిమిది మంది స్మగ్లర్లను అరెస్టు చేశారు.

ఎర్రచందనం అక్రమరవాణాపై దాడులు.. 8 మంది అరెస్టు
ఎర్రచందనం అక్రమరవాణాపై దాడులు.. 8 మంది అరెస్టు

By

Published : Jul 25, 2020, 10:27 PM IST

కడప జిల్లా ఒంటిమిట్ట, సిద్దవటం అటవీ ప్రాంతాల్లో పోలీసులు, అటవీ శాఖ సిబ్బంది సంయుక్తంగా ఎర్రచందనం అక్రమరవాణాపై దాడులు జరిపారు. పది ఎర్రచందనం దుంగలు సహా మొత్తం ఎనిమిది మందిని అరెస్టు చేశారు. పక్కా సమాచారంతో ఈ దాడులు చేశామని రాజంపేట డీఎస్పీ నారాయణస్వామిరెడ్డి తెలిపారు. ఈ దాడుల్లో ఒంటిమిట్ట సీఐ హనుమంతునాయక్, ఎస్ఐ అమర్నాథ్ రెడ్డి, అటవీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details