కడప జిల్లా మైదుకూరులో ఆటోతో సహా ఎనిమిది కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నలుగురు నిందితులను అరెస్టు చేశారు. పట్టణంలోని శాంతినగర్ కు చెందిన పుల్లయ్య అనే వ్యక్తి విశాఖపట్నం నుంచి గంజాయి తెప్పించి అనుచరుల ద్వారా విక్రయిస్తున్నట్లుగా డీఎస్పీ విజయకుమార్ తెలిపారు.
నిందితుల వివరాలు..
మైదకూరులో స్థిరపడిన కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం నక్కలదిన్నెకు చెందిన వెంకటేశ్వర్లుతో పాటు సహనిందితులు భూమాయపల్లె వెంకటసుబ్బయ్య, అక్కమ్మ గారి చంద్ర, ఆటో చోదకుడు షేక్ షఫీలను అరెస్టు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ప్రధాన నిందితుడు పుల్లయ్య పరారీలో ఉన్నట్లు వెల్లడించారు.