కడప జిల్లా రాయచోటిలో రిలే నిరాహార దీక్ష చేస్తున్న భాజపా నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. కడప జిల్లా రాయచోటిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల స్థలాన్ని పరిరక్షించాలని రెవెన్యూ కార్యాలయం ఎదుట 2 రోజులుగా భాజపా నాయకులు, పూర్వ విద్యార్థి సంఘాలు కలిసి రిలే నిరాహార దీక్ష చేపట్టారు. సీఎం పర్యటన నేపథ్యంలో నిరసనలకు అనుమతి లేదంటూ పోలీసులు దీక్షా శిబిరంలోని భాజపా నాయకులను అదుపులోకి తీసుకున్నారు. 90 ఏళ్లుగా లక్షలాది మంది విద్యార్థులకు భవిష్యత్తును ఇచ్చిన జూనియర్ కళాశాల స్థలాన్ని స్థానిక ఎమ్మెల్యే ఇతర అవసరాలకు కట్టబెట్టాలని చూస్తున్నారనినాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.
రాయచోటిలో భాజపా నాయకుల దీక్ష.. అరెస్ట్ - police arrested bjp leaders at kadapa district news
కడప జిల్లా రాయచోటిలో రిలే నిరాహార దీక్ష చేస్తున్న భాజపా నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
భాజాపా నాయకులను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు