ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

KADAPA MURDER CASE: హత్య కేసు నిందితులు అరెస్ట్ - కడప జిల్లా నేర వార్తలు

కడప చిన్న చౌక్ పరిధిలో ఈ నెల 12న జరిగిన హత్యకు సంబంధించిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. తొమ్మిది మందిపై రౌడీషీట్ ఓపెన్ చేస్తున్నట్లు డీఎస్పీ సునీల్ స్పష్టం చేశారు.

నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

By

Published : Aug 17, 2021, 1:43 PM IST

కడప చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 12న జరిగిన హత్య కేసులో 9 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి హత్యకు ఉపయోగించిన రెండు కత్తులు, 4 చరవాణులు, 3 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన వారిని డీఎస్పీ సునీల్ తన కార్యాలయంలో మీడియా ఎదుట హాజరుపరిచి వివరాలు వెల్లడించారు.

కడప రవీంద్రనగర్​కు చెందిన సయ్యద్ సంధానీ బాషాకు, కడప హబీబుల్లా వీధికి చెందిన షేక్ ఖాజా మొహియుద్దీన్​కు.. రెండేళ్ల క్రితం గొడవ జరిగింది. అప్పటినుంచి మృతుడు షేక్ ఖాజాను చంపుతానని సయ్యద్ బెదిరించేవాడు. ఇటీవల ఓ పెళ్లిలో మళ్లీ ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో పగ పెంచుకున్న షేక్ ఖాజా.. ఈనెల 12న సయ్యద్​పై కత్తులతో దాడి చేసి కిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘటనలో భాగం పంచుకున్న 9 మందిపై రౌడీషీట్ ఓపెన్ చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details