Kadapa Tadipatri road: వైఎస్ఆర్ కడప జిల్లా కమలాపురం సమీపంలోని కడప, తాడిపత్రి ప్రధాన రహదారిపై ఉన్న అప్రోచ్ రోడ్డుపై నీరు ప్రవహిస్తుండటంతో వాహనదారులు రాకపోకలు ఇబ్బందులు ఏర్పడ్డాయి. వెలిగల్లు నుంచి నీటిని వదిలారని.. అప్రోచ్ రోడ్డుపై నీటి ప్రవాహం పెరుగుతుందన్న సమాచారం తెలుసుకున్న కమలాపురం ఎస్ఐ చిన్న పెద్దయ్య జిల్లా ఎస్పీ అనుబురాజన్ ఆదేశాల మేరకు తన సిబ్బందితో స్వయంగా పాపాఘ్నినది వద్దకు చేరుకున్నారు.
కడప-తాడిపత్రి అప్రోచ్ రోడ్డుపై నీరు.. వాహనాల దారి మళ్లింపు - కడప రహదారి అప్రోచ్ రోడ్డుపై నీరు
Kadapa Tadipatri road due to waterflow: వైఎస్ఆర్ కడప జిల్లా కమలాపురంలో తాడిపత్రికి వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న అప్రోచ్ రోడ్డుపై నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. వెలిగల్లు నుంచి పాపాగ్ని నది నీరు దిగువకు వదలడంతో నీటి ప్రవాహం పెరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు.. పాపాగ్ని నది వద్దకు చేరుకుని ముందుస్తు చర్యల్లో భాగంగా ఎర్రగుంట్ల వైపు నుంచి వచ్చే వాహనాలను దారి మళ్లించారు.
పోలీసులు రహదారిపై రాకపోకలను తాత్కాలికంగా నిలిపేశారు. ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా ఎర్రగుంట్ల వైపు నుంచి వచ్చే వానాలను క్రాస్ రోడ్డు వద్ద డైవర్షన్ ఏర్పాటు చేసి మళ్లీస్తున్నట్లు అధికారులు తెలిపారు. వాహనాలను ఖాజీపేట వైపుకు దారి మళ్లించినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. దారి మళ్లీంపు విషయాన్ని ప్రయాణికులు గమనించాలని వెల్లడించారు. కడప నుంచి వచ్చేవారు.. చెన్నూరు కాజీపేట కమలాపురం మీదుగా ఎర్రగుంట్ల వెళ్ళాలని తెలిపారు. నీటి ప్రవాహం తగ్గిన వెంటనే వాహనదారులను అనుమతిస్తామని ఎస్ఐ చిన్న పెద్దయ్య తెలిపారు.
ఇవీ చదవండి: