ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కుమారుని మీద కేసు: స్పందించిన మాజీ ఎమ్మెల్యే - కడప జిల్లా తాజా వార్తలు

హైదరాబాద్​ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్​లో తన కుమారునిపై కేసు నమోదు విషయంలో పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి స్పందించారు. స్థల వివాదం నిజమేనన్నారు.

poddutur farmer responding to sons case at banjara hills Hyderabad
కుమారుని మీద కేసుపై స్పందించిన పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే

By

Published : Oct 7, 2020, 10:45 PM IST

కడప జిల్లా పొద్దుటూరులోని ఓ స్థలం విషయంలో శివ గణేశ్​, తన కుమారుడు కొండారెడ్డి మధ్య వివాదం ఉన్న మాట వాస్తవమేనని మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి అన్నారు. ఈ మేరకు హైదరాబాద్​ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్​లో కుమారుని మీద కేసు నమోదుపై స్పందించారు.

ఇద్దరూ కలిసి కొన్ని ఏళ్లుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారన్నారు. పొద్దుటూరులోని తమకు రావాల్సిన భూమి ఇవ్వకుండా శివ గణేశ్​ ఇబ్బంది పెట్టేవాడిని ఎమ్మెల్యే మీడియా సమావేశంలో ఆరోపించారు. శివ గణేశ్​ను కత్తులు, తుపాకులతో బెదిరించాల్సిన అవసరం తన కుమారునికి లేదని ఆయన పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details