కడపలో ప్రధానోపాధ్యాయుడిపై కేసు నమోదు కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలోని నారాపురం వెంకటేశ్వర స్వామి వీధిలో ప్రాథమిక పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న చిన్నారి తనను ప్రిన్సిపల్ లైంగికంగా వేధిస్తున్నాడని తల్లిదండ్రులతో మొరపెట్టుకుంది. దీనిపై ఈ నెల 21న బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు ప్రధానోపాధ్యాయుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: