కాలజ్ఞాన కర్త పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి సజీవ సమాధైన కడప జిల్లా బ్రహ్మంగారిమఠంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఎకో ఏర్పాటు కానుంది. ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, అటవీశాఖ డివిజనల్ అధికారి ప్రభాకర్, భాజపా నాయకుడు బీపీ వెంకటప్రతాపరెడ్డిలు స్థల పరిశీలన చేశారు.
బ్రహ్మంగారి మఠంలో ఎకో పార్కు ఏర్పాటుకు ప్రణాళికలు - కాలజ్ఞాన కర్త పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి సజీవ సమాధి
కడప జిల్లా బ్రహ్మం గారి మఠంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఎకో పార్క్ ఏర్పాటు కానుంది. స్థానిక ఎమ్మెల్యే, అటవీ శాఖ డివిజనల్ అధికారి, భాజపా నాయకులు.. ఈ పార్క్ కోసం స్థల పరిశీలన చేేశారు. రూ. 5 కోట్ల నిధులు మంజూరైనట్లు తెలిపారు.
బ్రహ్మంగారిమఠంలో ఎకో పార్కు ఏర్పటుకు ప్రణాళికలు
పార్కు ఏర్పాటుకు రూ. 5 కోట్లు మంజూరు చేయగా రూ. కోటి నిధులు విడుదల చేశారని తెలిపారు. పర్యాటకులను ఆకర్షించేలా సౌకర్యాలను కల్పించేందుకు మరో రూ. 25 కోట్లు అవసరం అవుతుందని అంచనా వేశారు. ఈమేరకు ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డితో చర్చించి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు.