సీఎం సహాయనిధి నకిలీ చెక్కుల వ్యవహారంలో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను దక్షిణ కర్ణాటకలోఅదుపులోకి తీసుకున్నారు. రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ అధికారులు... కర్ణాటక వెళ్లి నిందితులను పట్టుకున్నారు. యోగేశ్ ఆచార్య (40), ఉదయ శెట్టి కాంతవర్ (35), మంగళూరుకు చెందిన బ్రిజేష్ రాయ్ (35), బెల్తాంగడికి చెందిన గంగాధర్ సువర్ణ (45)ను అరెస్టు చేశారు.
నిందితులు ఏపీ సహాయ నిధి నుంచి రూ .117 కోట్లు మోసం చేయాలని యత్నించారు. సెప్టెంబర్ 21న ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ సహాయ కార్యదర్శి పి .మురళీకృష్ణారావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసును తీవ్రంగా పరిగణించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు జరపాలని అనిశాని ఆదేశించింది. విచారణ వేగవంతం చేసిన అనిశా అధికారులు దక్షిణా కన్నడ జిల్లాలో ఆరుగురు దుండగులను అరెస్టు చేశారు.