సుమారు 206 ఆవాసాలకు తాగునీరు అందించాల్సిన మంచినీటి పథకం లక్ష్యం... నీరుగారుతోంది. పైపులైను లీకేజీ కారణంగా భారీగా నీరు వృథా అవుతోంది. అన్నమయ్య ప్రాజెక్టు వెనుక జలాల నుంచి పుల్లంపేట మండలానికి తాగునీరు అందించేందుకు... 17 కోట్ల రూపాయలతో మంచినీటి పథకాన్ని ఏర్పాటు చేశారు. రెండు పైపులను అనుసంధానం చేసే ప్రాంతంలో... ఉద్ధృతిని తట్టుకునేందుకు ఏర్పాటు చేసిన వాల్వుల వద్ద నీరు వృథాగా పోతోంది. రోజుకు లక్షల లీటర్ల నీరు నేలపాలవుతుంది. ఈ సమస్య గురించి గ్రామీణ నీటిపారుదల శాఖ అధికారులను 'ఈటీవీభారత్' వివరణ కోరగా... త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు.
నీరుగారుతున్న మంచినీటి పథకాల లక్ష్యం..! - పైపులైను లీకేజి వార్తలు
కడప జిల్లా రాజంపేట అన్నమయ్య ప్రాజెక్టు వెనుక జలాల నుంచి... పుల్లంపేట మండలానికి తాగునీరు అందించేందుకు ఏర్పాట్లు చేశారు. పైపులైను లీకేజీ కారణంగా భారీగా నీరు వృథా అవుతోంది. ఈ సమస్యను 'ఈటీవీభారత్' ఆర్డబ్ల్యూఎస్ ఈఈ వీరన్న దృష్టికి తీసుకెళ్లగా... మరమ్మతులు చేయిస్తామని చెప్పారు.
కడప జిల్లా రాజంపేటలో పైపులైను లీకేజి