ఎంబసీని ఆశ్రయించిన తెలుగువారు:కువైట్ హత్యల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వెంకటేష్ విషయాన్ని అక్కడి తెలుగువారు ఇండియన్ ఎంబసీ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఈ వ్యవహారం కడప కలెక్టరేట్‌కు చేరింది. బాధితుడి భార్య స్వాతి వివరాలివ్వాలని కలెక్టరేట్ నుంచి పోలీసులకు ఆదేశాలందాయి.
ఇదీ చదవండి :Murder in Kuwait: కువైట్‌లో హత్య... కడపలో వైరల్..!
Kuwait Murder Case: కువైట్‌లో జరిగిన మూడు హత్యలకు నా భర్త వెంకటేశ్‌కు ఎలాంటి సంబంధం లేదని.. కువైట్ నుంచి స్వస్థలానికి వచ్చిన వెంకటేశ్ భార్య స్వాతి అన్నారు. ఈ మేరకు కడప జిల్లా లక్కిరెడ్డిపల్లె పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం కువైట్ నుంచి ఇండియాకు వచ్చిన పిల్లొళ్ల స్వాతి.. దిన్నెపాడు కస్పాలోని ఇంటికి చేరారు. అనంతరం.. ఏ తప్పు చేయని నా భర్తను ఎలాగైనా కాపాడాలని లక్కిరెడ్డిపల్లె పోలీసులను ఆశ్రయించారు.
'కువైట్‌లో సేఠ్, అతని భార్య, కూతుర్ని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. వేరే ఇంట్లో డ్రైవర్‌గా పని చేస్తున్న తన భర్త వెంకటేశ్‌పై కేసు పెట్టి అన్యాయంగా ఇరికించారు. బతుకు తెరువు కోసం కువైట్ వెళ్లాం. అక్కడ జరిగిన మూడు హత్యలతో నా భర్తకు ఎలాంటి సంబంధం లేదు. ఎవరో చేసిన హత్యలకు తన భర్తను శిక్షించడం ఎంతవరకు న్యాయం' అని స్వాతి కన్నీటి పర్యంతమయ్యారు.