ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వాటి ఆధారంగా కులాన్ని నిర్ధారించడానికి వీల్లేదు: హైకోర్టు - తెలుగు వార్తలు

ఎస్సీ కుల ధ్రువపత్రాలు పొందేందుకు 1998లో సాంఘిక సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి జారీచేసిన మెమో అడ్డంకిగా ఉందని.. దానిని రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. అద్దంకి మండలం శంకవరప్పాడు గ్రామానికి చెందిన కాకుమాను రమేశ్‌బాబు, వైయస్ఆర్​ జిల్లాకు చెందిన స్వరూప్‌ వేదానంద్‌ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. సాంఘిక సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్‌ను ప్రతివాదులుగా పేర్కొన్నారు.

high court
high court

By

Published : Apr 24, 2022, 4:59 AM IST

ఎస్సీ కుల ధ్రువపత్రాలు పొందేందుకు 1998లో సాంఘిక సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి జారీచేసిన మెమో అడ్డంకిగా ఉందని, దానిని రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో పిల్‌ దాఖలైంది. 1975లో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు, 1980, 1997లో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోలకు విరుద్ధంగా ఆ మెమో ఉందని పేర్కొంటూ దళిత ఉద్యమకారుడు, అద్దంకి మండలం శంకవరప్పాడు గ్రామానికి చెందిన కాకుమాను రమేశ్‌బాబు, వైయస్ఆర్ జిల్లాకు చెందిన స్వరూప్‌ వేదానంద్‌ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.

సరైన కారణాలు లేకుండా దరఖాస్తులను తిరస్కరించకుండా అధికారులను ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషినర్ కోరారు. సాంఘిక సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్‌ను ప్రతివాదులుగా పేర్కొన్నారు. మెమోను ఆధారం చేసుకొని ఆచార వ్యవహారాలు, జీవన విధానం, పండగల నిర్వహణ అంశాలపై విచారణ చేస్తున్నారని పేర్కొన్నారు. ఆంగ్లం, ఫ్యాన్సీ పేర్లు పెట్టుకుంటే పేరు క్రిస్టియన్‌గా ఉందనే కారణంతో ధ్రువపత్రం ఇవ్వడంలేదన్నారు. బైబిల్‌, క్రైస్తవ సాహిత్యం, క్యాలెండర్‌ ఉన్నాయనే కారణంతో కుల ధ్రువపత్రంపై నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదన్నారు. ఎస్సీ సామాజిక వ్యక్తి చర్చికి వెళ్లి సువార్త వింటే.. అతన్ని క్రైస్తవాన్ని ఆచరిస్తున్నట్లు ప్రకటించి ఎస్సీ కులధ్రువపత్రం ఇవ్వడానికి నిరాకరిస్తున్నారన్నారు. కేంద్రం1975లో ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం.. కుల ధ్రువపత్రం వ్యక్తి పుట్టుక, తల్లిదండ్రుల రికార్డుల ఆధారంగా ఇవ్వాలని స్పష్టం చేస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం1980లో ఇచ్చిన జీవో ప్రకారం.. పాఠశాల రికార్డుల్లో ఎస్సీ అని నమోదై ఉంటే ఎలాంటి విచారణ అవసరం లేకుండానే ధ్రువపత్రం ఇవ్వాల్సి ఉందన్నారు.

ఇదీ చదవండి:నాకు ఉప ప్రధాని పదవి ఇస్తా అంటే.. నేనే వద్దన్నా : కేఏ పాల్

ABOUT THE AUTHOR

...view details