TRAPPED: భైరవకోన అటవీ ప్రాంతంలో టెన్షన్..వాగులో చిక్కుకున్న యాత్రికులు - pilgrims trapped in stream at bhiravakona
దైవ దర్శనం కోసం వెళ్లిన భక్తులు వాగులో చిక్కుకున్నారు. కడప జిల్లా భైరవకోన నల్లమల అటవీ ప్రాంతంలోని వాగులో వరద ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతుండటంతో బిక్కుబిక్కుమంటున్నారు.
భైరవకోన అటవీ ప్రాంతంలోని వాగులో చిక్కుకున్న యాత్రికులు
కడప జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో నల్లమల అటవీ ప్రాంతంలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరద అధికంగా వస్తుండటంతో ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో మైదుకూరు మండలంలోని భైరవకోనకు వెళ్లిన భక్తులు.. ట్రాక్టర్లతో సహా వరద ప్రవాహంలో చిక్కుకున్నారు. కొందరు సాహసించి వాగులో నుంచి ట్రాక్టర్లను ఒడ్డుకు చేర్చే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు 30 ట్రాక్టర్లు ఆప్రాంతంలో చిక్కుకుపోయినట్లు స్థానికులు తెలిపారు.