కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం ఎర్రగుంట్ల నగర పంచాయతీలో దాదాపు మూడు వేల మంది దివ్యాంగులున్నారు. వీరికి సచివాలయ ఉద్యోగాలలో అన్యాయం జరిగిందంటూ రోస్టర్ పాయింట్ 56పెట్టి అన్యాయం చేశారని నిరసన తెలిపారు. మరుగుజ్జుల వికలాంగుల రాష్ట్ర అధ్యక్షుడు జాషువా మాట్లాడుతూ... ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డులతో పాటు అన్ని విషయాలలో అన్యాయం జరుగుతుందని... ఈ అన్యాయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూడాలని కోరారు. రాష్ట్రంలో దాదాపు 5 లక్షల మంది వికలాంగులున్నారని ఎన్ని ప్రభుత్వాలు మారినా తమకు న్యాయం జరగటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తామంతా కలిసి విజయవాడ ధర్నా చౌక్ వద్ద ఆందోళనలు చేసి తమ సమస్యను ప్రభుత్వానికి తెలిసేలా చేస్తామని తెలిపారు.
సచివాలయ ఉద్యోగాలలో అన్యాయం... దివ్యాంగుల ఆందోళన - PHDS PROBELMES IN SECRETARIAT JOBS
సచివాలయ ఉద్యోగాలలో తమకు అన్యాయం జరిగిందంటూ దివ్యాంగులు కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో నిరసన చేపట్టారు. చలో విజయవాడ కార్యక్రమం చేపట్టి ముఖ్యమంత్రికి తమ సమస్యను చెప్పుకుంటామని వెల్లడించారు.
నిరసన చేస్తున్న దివ్యాంగులు