Petrol Attack on the face of a young man in YSR District: వైఎస్‌ఆర్ జిల్లా ప్రొద్దుటూరు మండలం అమృతనగర్‌లో నరసింహ అనే వ్యక్తి ముఖంపై కొందరు పెట్రోలు పోసి నిప్పంటించారు. తీవ్రంగా గాయపడిన అతన్ని కడప రిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రొద్దుటూరు గ్రామీణ ఎస్సై సంజీవ రెడ్డి వెల్లడించారు. ప్రొద్దుటూరు మండలం మడూరు రోడ్డుకు చెందిన నరసింహ పాత బట్టల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆదివారం మడూరు రోడ్డులోని ఖాళీ ప్రదేశంలో నరసింహ మద్యం సేవిస్తూ మొబైల్ ఫోన్‌లో బిగ్గరగా మాట్లాడుతున్నాడు. పక్కనే ఉన్న చిన్న, ప్రసాద్ ఫోన్‌లో ఎందుకు గట్టిగా మాట్లాడుతున్నావని ప్రశ్నించడంతో వారి మధ్య మాటామాటా పెరిగింది.
యువకుడి ముఖంపై పెట్రోలు పోసి నిప్పంటించారు.. ఆదే కారణమా ? - యువకుడి ముఖంపై పెట్రోల్ దాడి
YSR District Crime News: వైఎస్‌ఆర్ జిల్లా ప్రొద్దుటూరు మండలం అమృతనగర్‌లో దారుణం చోటు చేసుకుంది. నరసింహ(27) అనే వ్యక్తి ముఖంపై కొందరు స్థానికులు పెట్రోలు పోసి నిప్పంటించారు. నరసింహ ముఖం తీవ్రగాయాలు కావడంతో ఆయన్ను కడప రిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. చిన్నపాటి వివాదం.. ఈ దారుణానికి దారి తీసింది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ప్రొద్దుటూరు గ్రామీణ ఎస్సై సంజీవ రెడ్డి తెలిపారు.
ఈ క్రమంలో ద్విచక్రవాహనంలోని పెట్రోల్ తీసిన చిన్న, ప్రసాద్.. మరికొందరితో కలిసి దాన్ని నరసింహపై పోసి నిప్పంటించారు. దీంతో అతడి ముఖం, శరీరంపై తీవ్ర గాయాలయ్యాయి. గట్టిగా కేకలు వేస్తుండటంతో గమనించిన స్థానికులు.. నరసింహను ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్‌కు తరలించినట్లు ఎస్సై సంజీవ రెడ్డి తెలిపారు. అయితే గతంలోనూ వారి మధ్య చిన్నపాటి గొడవ జరిగిందని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
ఇదీ చదవండి: