కడప ఎస్బీఐ కాలనీకి చెందిన ఆవుల చంద్రమోహన్ రెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. చంద్రమోహన్ రెడ్డి కొంతమందికి డబ్బులు అప్పుగా ఇవ్వగా వారు తిరిగిఇవ్వలేదు.
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య - కడప జిల్లా తాజా వార్తలు
అప్పు తీసుకున్న వారు...తిరిగి చెల్లించడం లేదని అడిగితే వేధిస్తున్నారని.. మనస్తాపంతో ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన కడపలో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య
అంతేగాక.. అతను మరికొన్ని సమస్యలతో సతమతమవుతున్నాడు. చివరిసారిగా తన కుతూరుతో ఫోన్ లో మాట్లాడి తన బాధను వెళ్లబోసుకున్నాడు. ఫోన్ పెట్టేసిన అనంతరం విషం తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: