కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండల కేంద్రంలో దారుణం జరిగింది. పాతకక్షలతో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. స్థానికంగా నివాసం ఉండే సాంబశివారెడ్డి, ఈశ్వర్రెడ్డిల మధ్య స్థలం విషయంలో తగాదాలు జరిగాయి. ఒకరిపై మరొకరు కక్ష పెంచుకున్నారు. ఈ నేపథ్యంలో ఈశ్వర్రెడ్డి, మహేశ్వర్రెడ్డి అనే మరో వ్యక్తితో కలిసి సాంబశివారెడ్డిపై కత్తితో దాడి చేసి పరారయ్యారు. ఛాతిపై గాయం కావడం వల్ల సాంబశివారెడ్డి కుప్పకూలిపోయాడు.
స్థానికులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా మార్గమధ్యలో మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. పరారైన నిందితుల కోసం గాలిస్తున్నారు.