ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రొద్దుటూరులో అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి - proddutur latest crime news

కడప జిల్లా ప్రొద్దుటూరు సమీపంలో రహదారి పక్కన ఉన్న రేకుల షెడ్డులో ఓ వ్యక్తి అనుమానాస్పదస్థితిలో మరణించాడు. విషయం తెలుసుకున్న స్థానికి గ్రామీణ సీఐ విశ్వనాథ్​రెడ్డి ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడు రామాంజనేయులుగా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

person died in proddutu outskirts in aluminium metal shed
రేకుల షెడ్డులో పడి ఉన్న మృతదేహం

By

Published : May 14, 2020, 4:16 PM IST

కడప జిల్లా ప్రొద్దుటూరు అమృత్​నగర్​ సమీపంలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మరణించిన వ్యక్తి చెన్నమరాజు పల్లెకు చెందిన రామాంజనేయులుగా పోలీసులు గుర్తించారు. రహదారి పక్కన ఉన్న రేకుల షెడ్డులో ఓ వ్యక్తి చనిపోయినట్లు సమాచారం అందుకున్న స్థానిక పోలీస్ స్టేషన్​ సీఐ విశ్వనాథ్ రెడ్డి... సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. రామాంజనేయులు మృతికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. మృతదేహాన్ని ప్రొద్దుటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ విషయాన్ని వారి కుటుంబీకులకు తెలియజేశారు.

ABOUT THE AUTHOR

...view details