రోడ్డు ప్రమాదంలో కడప జిల్లా బద్వేలు మండలానికి చెందిన ఓబయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పొట్టిగారి పల్లె వద్ద 67వ జాతీయ రహదారిపై జరిగిన ఈ ఘటనలో.. నరసయ్య అనే మరొక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు క్షతగాత్రుడిని బద్వేలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఆటోను ఢీకొన్న కంటైనర్... ఒకరి మృతి మరొకరికి తీవ్ర గాయాలు - kadapa road accidents
రహదారిపై వెళ్తున్న ఆటోను ఢీకొట్టాడో కంటైనర్ డ్రైవర్. వాహనం ఆపితే కేసు అవుతుందనుకున్నాడో ఏమో.. వెంటనే గేరు మార్చి బయలుదేరాడు. అతని ప్రవర్తనతో ఆగ్రహించిన స్థానిక యువకులు.. ద్విచక్ర వాహనంపై వెంబడించి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ప్రమాదంలో ఒకరు మరణించగా.. మరొకరు తీవ్ర గాయాలపాలయ్యారు.
బద్వేలులో రోడ్డు ప్రమాదం
బద్వేలులోని చిన్న అగ్రహారానికి చెందిన ఓబయ్య, నరసయ్యలు నందిపల్లి నుంచి ఆటోలో వస్తున్నారు. నెల్లూరు వైపు నుంచి వేగంగా వస్తున్న కంటైనర్ వారిని ఢీకొట్టింది. ఆగకుండా వెళ్తున్న లారీని.. స్థానిక యువకులు ద్విచక్ర వాహనంతో వెంబడించి పట్టుకున్నారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి:కర్ణాటక మద్యం పట్టివేత.. ఇద్దరు అరెస్ట్