కడప శివారులో రైలు కిందపడి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కడప జిల్లా ఎర్రగుంట్లకు చెందిన నాగార్జునకు మూడు సంవత్సరాలు క్రితం వివాహం అయ్యింది. 6 నెలల పాప ఉంది. నాగార్జున చెడు అలవాట్లకు బానిస అయి అప్పులు చేశాడని కుటుంబసభ్యులు తెలిపారు. జీవితం పై విరక్తి చెంది రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుని భార్య, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చెడు అలవాట్లకు బానిసై వ్యక్తి ఆత్మహత్య - person committed suicde in railway track in kadapa dst
నిషా కోసం అప్పులు చేశాడు... కట్టుకున్న భార్యను కడుపున పుట్టిన పాపను పట్టించుకోవటం మానేశాడు. కానీ మత్తు వదిలాక జీవితం చిత్తు చిత్తు అయిందని అర్థంచేసుకుని విరక్తి చెందాడు... సంసార సాగారాన్ని ఈదలేక ఆ వ్యక్తి రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. కడప జిల్లాలో జరిగిన ఈ ఘటన కుటుంబసభ్యుల్లో విషాదాన్ని నింపింది..

person commited suicide in cadapa dst erraguntla