కడప జిల్లా ఇడుపులపాయలోని దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి సమాధి దగ్గర తిరుపతి వైకాపా పార్లమెంట్ అభ్యర్థి గురుమూర్తి నివాళులర్పించారు. ఈ నెల 29న తిరుపతి పార్లమెంట్ కు నామినేషన్ వేయనున్న నేపథ్యంలో.. నామినేషన్ పత్రాలను రాజశేఖర్రెడ్డి సమాధిపై ఉంచి ఆశీస్సులు తీసుకున్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా.. రాష్ట్రంలో వైకాపా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో.. ప్రజలు ఆనందంగా ఉన్నారన్నారు. ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొందుతానని.. గురుమూర్తి దీమా వ్యక్తం చేశారు.
వైకాపా సంక్షేమ పథకాలతో ప్రజలు ఆనందంగా ఉన్నారు: గురుమూర్తి - వైఎస్సార్ సమాధి వద్ద నివాళులర్పించిన తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి గురుమూర్తి
రాష్ట్రంలో వైకాపా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో ప్రజలు ఆనందంగా ఉన్నారని తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి గురుమూర్తి అన్నారు. ఈ నెల 29న తిరుపతి పార్లమెంట్ కు నామినేషన్ వేయనున్న నేపథ్యంలో.. నామినేషన్ పత్రాలను, కడపలోని దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్రెడ్డి సమాధిపై ఉంచి ఆశీస్సులు తీసుకున్నారు.
![వైకాపా సంక్షేమ పథకాలతో ప్రజలు ఆనందంగా ఉన్నారు: గురుమూర్తి ycp, mp candidate gurumurthy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11167338-778-11167338-1616753309817.jpg)
వైఎస్సార్ సమాధి వద్ద తిరుపతి వైకాపా ఎంపీ అభ్యర్థి గురుమూర్తి నివాళులు