ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా నిబంధనలకు నీళ్లు..బిర్యానీ కోసం బారులు ! - కడపలో బిర్యానీ కోసం బారులు

ఓ వైపు కరోనా కరాళ నృత్యం చేస్తుంటే..మరో వైపు ప్రజలు బిర్యానీ కోసం బారులు తీరటం విస్మయానికి గురి చేస్తోంది. కడప జిల్లా బద్వేలు పట్టణం సమీపంలోని ఓ హోటల్​లో బిర్యానీ ఒకటి కొంటే మరొకటి ఉచితమని ప్రకటించటంతో ప్రజలు కరోనా నిబంధనలు గాలికి వదిలేసి..బిర్యానీ కోసం పోటీ పడ్డారు. ఉచితంగా వచ్చే బిర్యానీపై ఉన్న శ్రద్ధ..,తమ ప్రాణాలపై లేకపోవటం పట్ల పలువురు ముక్కున వేలేసుకుంటున్నారు.

people violate corona rules and q line for biryani
కరోనా నిబంధనలకు నీళ్లు..బిర్యానీ కోసం బారులు

By

Published : Apr 29, 2021, 6:57 PM IST

కరోనా నిబంధనలకు నీళ్లు..బిర్యానీ కోసం బారులు

దేశవ్యాప్తంగా కరోనా కరాళ నృత్యం చేస్తోంది. రోజు రోజుకు పెరుగుతున్న కేసులతో రాష్ట్రం చిగురుటాకులా వణికిపోతుంది. కరోనా కట్టడికి ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. మాస్కులు, శానిటైజర్, భౌతికదూరం పాటించాలని పదేపదే చెబుతోంది. ఇవేవీ పట్టని కడప జిల్లా ప్రజలు బిర్యానీ కోసం బారులు తీరటం విస్మయానికి గురి చేస్తోంది. బద్వేలు సమీంలోని చెన్నంపల్లి వద్ద కొత్తగా ప్రారంభించిన హోటల్​లో బిర్యాని ఒకటి కొంటే మరొకటి ఉచితమని చెప్పటంతో కరోనా నిబంధనలు గాలికి వదిలేసి..బిర్యానీ కోసం బారులు తీరారు. ఒకర్నొకరు తోసుకుంటూ బిర్యానీ ప్యాకెట్ల కోసం పోటీపడ్డారు.

కరోనా దావానంలా వ్యాపిస్తున్న ప్రస్తుత పరిస్థితులో బిర్యానీ కోసం బారులు తీరటంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు ఉచితంగా వచ్చే బిర్యానీపై ఉన్న శ్రద్ధ..,తమ ప్రాణాలపై లేకపోవటం పట్ల ముక్కున వేలేసుకుంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details