కుందూనదిలో గల్లంతైన యువకుల కోసం గాలింపు..
09:49 September 16
gallanthu taza
కడప జిల్లా ప్రొద్దుటూరు వినాయక నిమజ్జనంలో అపశ్రుతి చోటు చేసుకుంది. నిమజ్జనానికి సంబంధించి సరైన రక్షణ ఏర్పాట్లు చేయకపోవడంతో కామనూరు వంతెన వద్ద కుందూ నదిలో వినాయక నిమజ్జనానికి వెళ్లి ఇద్దరు యువకులు గల్లంతు అయ్యారు. దస్తగిరి పేటకు చెందిన షేక్ నిజాం ( 25 ) గల్లంతయ్యాడు. అతన్ని కాపాడేందుకు మరో ముగ్గురు యువకులు నదిలో దూకారు. అందులో ఇద్దరికి ఈత రావడంతో నదిలో నుంచి ప్రాణాలతో బయటపడగా.. ప్రవాహంలో దిగిన మరో యువకుడు తల్వార్( 25 ) కూడా గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న అధికారులు కుందూలో గాలిస్తున్నారు.
అయితే నిమజ్జనానికి సంబంధించి కుందూ వంతెన వద్ద అధికారులు సరైన రక్షణ ఏర్పాట్లు చేయకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. బారికేడ్లు..లైటింగ్ కూడా ఏర్పాటు చేయకపోవడంతో స్థానికులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చేసేదేమీ లేక చీకటిలోనే నిమజ్జనం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిమజ్జనం సమయంలో కుందూ వద్ద గజఈతగాళ్లు ఉండాలని.. వారు లేకపోవటంతో ఈ ఘటన జరిగిందని స్థానికులు విమర్శించారు.
ఇదీ చదవండీ..ఊటపల్లిలో కిడ్నాప్ యత్నం... పోలీసులకు చిక్కిన నిందితులు