కనిపించని శక్తులు రాష్ట్రంలోని దేవాలయాల్లో విగ్రహాల ధ్వంసానికి పాల్పడుతున్నాయని త్రిదండి చినజీయర్ స్వామి అన్నారు. ప్రజల్లో భక్తి భావం పెరిగినప్పుడే ఆలయాల సంరక్షణ సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. తన యాత్రలో భాగంగా కడప జిల్లాలోని నందలూరు సౌమ్య నాథ స్వామి ఆలయం, ఒంటిమిట్ట కోదండ రామాలయం, సిద్ధవటం రంగనాథ స్వామి ఆలయాలను స్వామిజీ సందర్శించారు. ఆయనకు అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయాల అధికారులు, స్థానికులతో స్వామీజీ మాట్లాడారు. దేవాలయాల సంరక్షణ బాధ్యతను ప్రజలు కూడా తీసుకోవాలని కోరారు.
'దేవాలయాల సంరక్షణ బాధ్యతను ప్రజలూ తీసుకోవాలి' - త్రిదండి చినజీయర్ స్వామి వార్తలు
ప్రజల్లో భక్తి భావం పెరిగినప్పుడే ఆలయాల సంరక్షణ సాధ్యమవుతుందన త్రిదండి చినజీయర్ స్వామి అన్నారు. తన యాత్రలో భాగంగా కడప జిల్లాలోని ప్రముఖ ఆలయాలను ఆయన సందర్శించారు.
chinna jeeyar swamy