ఎత్తు తక్కువ వంతెనతో ప్రజల అవస్థలు - కడపలో ఎత్తు తక్కువ వంతెనతో ప్రజల అవస్థలు
కడపలో కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చాలా చోట్ల ఎత్తు తక్కువ వంతెనలతో ప్రజల అవస్థలు పడుతున్నారు.వంతెనల పైనుంచి వరదనీరు ప్రవహించి రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
![ఎత్తు తక్కువ వంతెనతో ప్రజల అవస్థలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4646318-thumbnail-3x2-vandhena.jpg)
people-road-problems-in-cadapa
ఎత్తు తక్కువ వంతెనతో ప్రజల అవస్థలు
కడప జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలతో వరదనీరు లోతట్టు ప్రాంతాలకు చేరి ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు చెబుతున్నారు.ప్రొద్దుటూరు,రాజుపాళెం మండలాల్లో ఎత్తు తక్కువ వంతెనలు ఉన్నాయని...వరదల సమయంలో వాటిపై నీరు చేరడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.రాజుపాళెం మండలంలోని కూలూరు,గాదెగూడూరు,కొట్టాల తదితర ప్రాంతాల్లో25చోట్ల వంతెనల్లో ఇదే సమస్య తలెత్తుతోందని చెబుతున్నారు.అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.