'కనీస సౌకర్యాలు కల్పించండి సారూ..' - people problems
ఎన్ని ప్రభుత్వాలు మారినా పేద ప్రజల తలరాతలు మారడం లేదు. ఉండేందుకు సరైన ఇల్లు లేక... కనీస సౌకర్యాలకు దూరంగా నివసిస్తున్నారు. అందుకు కడప జిల్లా అట్లూరు మండలం గాండ్లపల్లి గ్రామమే నిలువెత్తు నిదర్శనం.
ఇది కడప జిల్లా అట్లూరు మండలంలోని గాండ్ల పల్లె గ్రామం. ఇక్కడ సరైన రవాణా సౌకర్యం లేదు. ఇల్లు, పక్కా గృహాలు శిథిలావస్థకు చేరి కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. పేద ప్రజల దైనందిన జీవనాన్ని గడుపుతున్నారు. వీరికి గత ప్రభుత్వ హయాంలో పక్కా గృహాలు నిర్మించారు. ప్రస్తుతం ఉన్న ఇల్లు కూలేందుకు సిద్ధంగా ఉండటంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని దినదిన గండంలా కాలం వెళ్లబుచ్చుతున్నాడు. శిధిలమైన ఇళ్ల స్థానంలో నూతన గృహాలను నిర్మించాలని ప్రజలు విజ్ఞప్తి చేసినా పాలకులు,అధికారులు స్పందించలేదని ఆ గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా గ్రామంలో కనీస సౌకర్యాలు కల్పించి, పక్కా గృహాలు నిర్మించి ఆదుకోవాలని ప్రజలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.