problems due to lack of bridge : వంతెన ఒరగడంతో ఒక స్తంభాన్ని తొలిగించి తొమ్మిది నెలలు దాటింది. ఇప్పటికీ దాన్ని పూర్తి చేయలేదు. తాత్కాలికంగా నిర్మించిన రోడ్ కూడా వరద ధాటికి కొట్టుకుపోయింది. ఫలితంగా 16గ్రామాల ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇది వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగులోని పెన్నానదిపై నిర్మించిన వంతెన పరిస్థితి..ప్రజల దుస్థితి.
వైఎస్‌ఆర్ జిల్లా జమ్మలమడుగు వద్ద పెన్నానది ప్రధాన వంతెన ఒరిగిపోవడంతో ఒక స్తంభాన్ని అధికారులు తొలగించారు. పనులు పూర్యయ్యేంతవరకు ఏర్పాటు చేసిన తాత్కాలిక రోడ్డు కూడా వరద ఉద్ధృతికి కొట్టుకుపోయింది. ఈనెల 7వ తేదీ నుంచి పెన్నానదిలోని మైలవరం జలాశయం నుంచి నీటిని విడుదల చేశారు. 4వేల క్యూసెక్కుల నుంచి 38 వేల క్యూసెక్కుల వరకు వరదనీటిని విడుదల చేశారు.