ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తాత్కలికంగా అప్రోచ్​ రోడ్డు.. ఇప్పటికీ రెండుసార్లు తెగింది..! - వైఎస్సార్​ జిల్లా వార్తలు

People Faced Problem Due To No Bridge : వంతెన నిర్మాణంలో ప్రభుత్వ అలసత్వం 16 గ్రామాల ప్రజలకు ఇబ్బందిగా మారింది. ఇటీవల కురిసిన వర్షాలకు వరద పోటెత్తడంతో తాత్కాలిక వంతెనకు అధికారులు గండికొట్టారు. ఫలితంగా వైఎస్సార్​ జిల్లాలో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కళాశాలలకు వెళ్లే విద్యార్థులు, రైతులు, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Penna river near Jammalamadugu
జమ్మలమడుగు

By

Published : Dec 14, 2022, 2:27 PM IST

మరమ్మతులకు నోచుకోని వంతెన, అవస్థలు పడుతున్న ప్రయాణికులు

People Faced Problem Due To No Bridge : గతేడాది కురిసిన భారీ వర్షాలకు వైఎస్సార్​ జిల్లా జమ్మలమడుగు సమీపంలోని పెన్నానదిపై ఉన్న వంతెన కుంగిపోయింది. దెబ్బతిన్న వంతెనస్థానంలో కొత్త వంతెన నిర్మాణం చేపట్టిన ప్రభుత్వం.. తాత్కాలిక రాకపోకల కోసం సమీపంలో అప్రోచ్​ రోడ్డు నిర్మించారు. నది మధ్యలో మట్టితో నిర్మించిన ఈ రోడ్డు చిన్నపాటి వర్షాలకే రెండుసార్లు తెగిపోయింది. మాండౌస్​ ప్రభావంతో జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురవడంతో పెన్నానదికి వరద పోటెత్తింది. అప్రోచ్​ రోడ్డు మీద రాకపోకలు ప్రమాదకరంగా మారడంతో.. అధికారులు ముందస్తు చర్యల్లో భాగంగా అప్రోచ్​ రోడ్డుకు గండికొట్టి నీటిని దిగువకు విడుదల చేశారు.

అప్రోచ్​ రోడ్డుకు గండికొట్టడంతో 16 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నిత్యం ఈ మార్గంలోనే పాఠశాలలకు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చుట్టూ 40 కిలోమీటర్లు తిరిగి జమ్మలమడుగు చేరుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్రిడ్జి నిర్మాణంలో జాప్యం వల్లే.. వర్షాలు వచ్చిన ప్రతిసారీ ఇబ్బందిపడుతున్నామని తెలిపారు.

"ఈ అప్రోచ్​ రోడ్డు సంవత్సరంలో ఇది మూడోసారి తెగిపోవటం. ఈ రోడ్డు తెగిపోవటం వల్ల దాదాపు 16 గ్రామాలకు జమ్మలమడుగు పట్టణానికి రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు స్పందించి ఈ అప్రోచ్​ రోడ్డును, వంతెన నిర్మాణాన్ని పూర్తి చేయాలని కోరుకుంటున్నాము." -ప్రయాణికుడు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details