ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వరద పోయేదెలా.. సమస్య తీరేదెలా? - morugudi in kadapa

చిన్న వర్షానికే వీధులన్నీ జలమయంగా మారాయి. వరద నీరు వెళ్లేందుకు మార్గం లేక నీళ్లు నిలిచిపోయాయి. కడప జిల్లా జమ్మలమడుగు మండలం మోరగుడి ప్రజలు.. ఈ పరిస్థితితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

moragudi streets with rain water
మోరగుడి ప్రాంతాన్ని పరిశీలించేందుకు వచ్చిన ఎమ్మెల్యేతో స్థానికులు

By

Published : Oct 12, 2020, 5:31 PM IST

కడప జిల్లా మోరగుడిలో మురుగు కష్టాలు వెంటాడుతున్నాయి. కొద్దిపాటి వర్షానికి ఆ ప్రాంతం జలమయం అవుతోంది. ఇటీవల కురిసిన వర్షాలకు గ్రామం అంతా వరద ప్రవాహంలో చిక్కుకుంది. నిలిచిపోయిన నీరంతా బురద గుంటలా తయారై జనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆ ప్రాంతాన్ని పరిశీలించి ప్రజలతో మాట్లాడారు. వర్షపు నీరు వెళ్లేందుకు దారి లేని కారణంగా.. చాలా ఏళ్లుగా పరిస్థితి ఇలాగే ఉంటోందని స్థానికులు తెలిపారు. కాలువలు లేని చోట ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.

ABOUT THE AUTHOR

...view details