ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జమ్మలమడుగులో రెండో డోసు వ్యాక్సినేషన్.. ప్రజల నిరాసక్తి - corona latest news

కరోనా టీకా వేస్తున్నారంటే చాలు... జనాలు ఎగబడుతున్నారు. గంటల తరబడి క్యూ లో నిలబడి టీకా వేయించుకునే అవకాశం వస్తుందో లేదో అని చాలా మంది ఎదురుచూస్తున్నారు. కాని కడప జిల్లా జమ్మలమడుగులో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఎన్ని సార్లు ఫోన్ చేసినా.. రెండో డోస్ వేయించుకునేందుకు ప్రజలు ముందుకు రావడం లేదు.

జమ్మలమడుగులో ఆస్పత్రి సిబ్బంది
జమ్మలమడుగులో ఆస్పత్రి సిబ్బంది

By

Published : May 13, 2021, 5:31 PM IST

జమ్మలమడుగు టీకా కేంద్రం

గంటల తరబడి క్యూలైన్‌లో నిల్చున్నా.... చాలా చోట్ల కరోనా టీకా రెండో డోస్ లభిస్తుందో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. కడప జిల్లా జమ్మలమడుగులో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. నగరపంచాయతీలో టీకా రెండో డోసు వేసేందుకు అనుమతి రాగా.... 200 మందికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శిబిరాన్ని ఏర్పాటు చేశారు. మధ్యాహ్నానికి కేవలం 30 మందే వచ్చారని... మిగతావారికి వైద్య సిబ్బంది ఫోన్‌ చేసినా ఇప్పటికి రాలేదని అధికారులు చెబుతున్నారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details