ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నకిలీ పత్రాలు సృష్టించారు... సబ్సిడీ దోచుకున్నారు - కడపలో డ్రిప్ ఇరిగేషన్ పేరిట అవినీతి

డ్రిప్ ఇరిగేషన్ పేరిట అవినీతికి పాల్పడుతున్న కొందరిపై చర్యలు తీసుకోవాలని కడప జిల్లాకు చెందిన బాధితురాలు డిమాండ్ చేశారు. ఒకరి పైరుపై ఉన్న స్థలాన్ని వేరేవారి పేరుపై మార్చి, నకిలీ పత్రాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఇరిగేషన్ సామగ్రిని కొనుగోలు చేసి సబ్బిడీ పొందుతున్నారని ఆరోపించారు.

డ్రిప్ ఇరిగేషన్ పేరిట కడపలో అవినీతికి పాల్పడుతున్నారని బాధితురాలి ఆరోపణ

By

Published : Nov 11, 2019, 4:57 PM IST

డ్రిప్ ఇరిగేషన్ పేరిట కడపలో అవినీతికి పాల్పడుతున్నారని బాధితురాలి ఆరోపణ

డ్రిప్ ఇరిగేషన్ పేరిట కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడుతున్నారని కడప జిల్లాకు చెందిన విజయలక్ష్మి ఆరోపించారు. కడప ప్రెస్​క్లబ్​లో మాట్లాడిన ఆమె.. తన పేరిట ముద్దనూరు మండలంలో 82 సెంట్ల స్థలం ఉందని తెలిపారు. డ్రిప్ ఇరిగేషన్​కు సంబంధించిన కొంతమంది డీలర్లు తనకు మరో 9 ఎకరాలు ఉన్నట్లు పత్రాలు సృష్టించి...ఇరిగేషన్ సామాగ్రిని కొనుగోలు చేసి సబ్సిడీ పొందారని ఆమె ఆరోపించారు. జిల్లాలో ముద్దనూరు, తొండూరు, కొండాపురం తదితర ప్రాంతాలలో 150 మంది పేర్లపై నకిలి పత్రాలు సృష్టించి మోసం చేశారని ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వ సొమ్మును ఇలా దుర్వినియోగం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details